English | Telugu

త్రివిక్రమ్ రేంజ్ పెరిగిందా..? తగ్గిందా..?

అ.ఆ సినిమా విడుద‌లైంది.. వ‌సూళ్లు అదిరిపోతున్నాయి. ఈ సినిమాకి క్యాప్ష‌న్లు కూడా త‌గిలించేస్తున్నారంతా. అందంగా.. ఆహ్లద‌క‌రంగా అంటూ అఆ టైటిల్‌కి జ‌స్టిఫికేష‌న్ చేసేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఈ సినిమానీ మీనా సినిమానీ ప‌క్క ప‌క్క‌న పెట్టి చూసిన వాళ్ల‌కు మాత్రం... అ.ఆలో కొత్త‌ద‌నం ఏమీ లేదు. మీనా సినిమాని, య‌ద్ద‌న‌పూడి రాసిన న‌వల‌నీ యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు అని పెద‌వి విరుస్తున్నారు. త్రివిక్ర‌మ్ ఇప్పుడంటే ద‌ర్శ‌కుడు. కానీ అంత‌కంటే ముందు ర‌చ‌యిత‌. ఎన్నో సున్నిత‌మైన క‌థ‌ల్ని రాశాడు.. రాయ‌గ‌ల‌డు. అలాంటి త్రివిక్ర‌మ్ పోయి పోయి.. ఓ పాత క‌థ‌ని ఎంచుకొన్నాడేంటి? నేను పాత సినిమానే మ‌ళ్లీ తీస్తున్నా.... అని చెప్ప‌క‌పోవ‌డం ఏమిటి? త్రివిక్ర‌మ్‌కి అప్పుడే క‌థ‌ల‌కు కొర‌త వ‌చ్చేసిందా? త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర క‌థ‌లు అయిపోయాయా? అంటూ.. విమ‌ర్శ‌నా బాణాలు సందిస్తున్నారు సాహితీ ప్రియులు. మీనా అంటే త్రివిక్రమ్‌కి ఇష్టం కావొచ్చు.. అందుకే ఆ సినిమాని మ‌ళ్లీ తీయాల‌నుకొన్నాడేమో. కానీ ఆ విష‌యం ముందే ధైర్యంగా ఎందుకు చెప్ప‌లేక‌పోయాడు? అంటే ఇది మీనా సినిమా అని ముందే చెప్పేస్తే... అ.ఆ చూడ‌క ముందే, అందరూ మీనా చూసేస్తార‌ని, దాంతో అ.ఆ న‌చ్చ‌క‌పోవొచ్చ‌న‌ని భ‌య‌ప‌డ్డాడా? ఇప్పుడు మ‌రి త్రివిక్ర‌మ్ కాపీ కొట్టాడ‌న్న ముద్ర ప‌డిపోయింది క‌దా, మ‌రి దాన్నుంచి త‌ను ఎలా త‌ప్పించుకోగ‌ల‌డు?? త్రివిక్ర‌మ్ లాంటి ర‌చ‌యిత‌కు ఇది త‌గిన ప‌నేనా? అ.ఆ ఇప్పుడు వ‌సూళ్ల మోత మోగించొచ్చు. కానీ త్రివిక్ర‌మ్ ఇమేజ్‌ని ఓ మెట్టు కింద‌కు దించింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. కాదంటారా??