English | Telugu

రెజీనాతో ఆ హీరోకి వార్ జ‌రుగుతోందా??

ఈమ‌ధ్య టాలీవుడ్‌లో ప్రేమాయాణాలు ఎక్కువ‌య్యాయి. పుసుక్కున ప్రేమ‌లో ప‌డిపోతున్నారు. పెళ్లికి ప‌రుగులు పెడుతున్నారు. తెర‌పైనే కాదు, బ‌య‌ట కూడా హీరో హీరో్యిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ ఓ లెవిల్లో పండుతోంది. అయితే ఓ హీరో ఓ హీరోయిన్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంద‌ట‌. ఇద్ద‌రూ ఎడ‌మొహం పెడ‌మొహంలా ఉంటున్నార‌ని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏదో అయ్యింద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వాళ్లెవ‌రో కాదు.. నాగ‌శౌర్య‌, రెజీనా. వీరిద్ద‌రూ క‌ల‌సి జ్యో అచ్యుతానంద సినిమాలో న‌టించాడు. అందులో రెజీనా, శౌర్య‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగానే పండింది.

అయితే బ‌య‌ట మాత్రం టామ్ అండ్ జెర్రీ వార్ న‌డుపుతున్నార‌ట‌. సెట్లో ఒక‌రంటే ఒక‌రికి ఒక్క క్ష‌ణం కూడా ప‌డేది కాద‌ని, సినిమా పూర్త‌య్యేక కూడా వీళ్లిద్ద‌రి మ‌ద్య దూరం త‌గ్గ‌లేద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ప్ర‌మోష‌న్ల విషయంలోనూ చాలా పేచీ పెట్టార‌ట‌. నాగ‌శౌర్య వ‌స్తే రెజీనా, రెజీనా వ‌స్తే నాగ‌శౌర్య రావ‌డం మానేశార‌ట‌. మ‌రి ఆ రేంజులో ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో అనేది ఆస‌క్తి క‌రంగా మారింది. వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి అవ‌స‌రాల శ్రీ‌నివాస్ తెగ క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. అయినా స‌రే.. ఫ‌లితం రాలేద‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రిగిందో ఏంటో?