English | Telugu
అమ్మో లారెన్స్.. పది పార్టులా??
Updated : May 6, 2015
సీక్వెల్ సినిమాకే కొత్త అర్థం చెప్పేలా ఉన్నాడు రాఘవ లారెన్స్. హారర్ కామెడీ జోనర్‌లో ముని తీశాడు. అది హిట్టయ్యింది. దానికి సీక్వెల్‌గా కాంచన తీశాడు. అదీ ఆడింది. అందుకే గంగని వదిలాడు. ఒకటి, రెండు, మూడు.. ఇలా ఇక్కడితో ఆపడట. ఏకంగా ఈ కథని పది పార్టులగా తీస్తానంటున్నాడు. అంటే ముని 10 అన్నమాట. దక్షిణాదిన ఓ సినిమాకి ఇన్ని సీక్వెల్స్ తీసిన దాఖలాలు లేవు. హాలీవుడ్‌లోనూ పది పార్టులు ఇంత వరకూ రాలేదు. అంటే లారెన్స్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడన్నమాట. అన్నట్టు ఈ పది భాగాల్లోనూ ఒకే ఒక్క పాత్ర రిపీట్ అవుతుందట. ఆ పాత్రే.. కోవై సరళ. ఆమెలాంటి నటిని ఇప్పటి వరకూ చూడలేదని, అందుకే అమ్మ పాత్రలో ఎప్పటికీ కోవైనే తీసుకొంటానని లారెన్స్ అంటున్నాడు. అన్నట్టు ముని పార్ట్ 4 కథ కూడా రెడీ అయిపోయిందట. త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తానంటున్నాడు రాఘవ.