English | Telugu

అందరినీ ఫూల్స్ చేసిన మంచు మనోజ్..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక పోస్ట్ టాలీవుడ్‌ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కడు మిగిలాడుతో పాటు ముందు ఒప్పుకున్న మరో సినిమాను పూర్తి చేసిన తర్వాత సినిమాల నుంచి రిటైర్‌ అవుతానని తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా నుంచి మనోజ్ ప్రకటించాడు. ఇక అంతే తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు మీడియా షాక్‌కు గురైంది.

మనోజ్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటూ రకరకాలుగా వార్తలు రాసింది మీడియా. అయితే మధ్యాహ్నానికి వచ్చే సరికి ఏమయ్యిందో ఏమో గానీ ఉదయం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును డిలీట్ చేశాడు. దీంతో మనోజ్ మనసు మార్చుకున్నాడని..కాదు కాదు..అకౌంట్ హ్యాక్ చేశారని అభిమానులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చర్చించుకుంటున్నారు. దీనిపై స్పందించిన మంచు మనోజ్ మీడియా మిత్రులు నా ట్వీట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని..నా నెక్ట్స్ సినిమా గురించి చెప్పే ఉద్దేశ్యంతో తాను ఆ పోస్ట్ పెట్టానని ట్వీట్ చేశాడు. తన చర్యను ఎంతగా సమర్ధించుకున్నా..మనోజ్ మాత్రం అభిమానులను, పరిశ్రమను కాస్త కన్ఫ్యూజ్ చేశాడన్నది మాత్రం వాస్తవం.