English | Telugu

శ్రీ‌నువైట్ల కు పంచ్ ఇచ్చిన మ‌హేష్‌!

రెండు భారీ ఫ్లాపుల‌తో.. కిందా మీదా ప‌డుతున్నాడు శ్రీ‌నువైట్ల‌. హీరోలెవ‌రూ ధైర్యం చేసి శ్రీ‌నువైట్ల‌తో సినిమా చేయ‌డానికి ముందుకు రావ‌డం లేదు. నిర్మాత‌లా.. శ్రీ‌ను పేరు చెబితే ఆమ‌డ దూరం పారిపోతున్నారు. ఈ ద‌శ‌లో.. శ్రీ‌నువైట్ల దారి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. ఓ పెద్ద హీరోని ప‌ట్టే స్థితిలో శ్రీ‌నువైట్ల లేడ‌న్న‌ది నిజం. ఓ మాదిరి హీరోలు కూడా శ్రీ‌నుని లైట్ తీసుకొంటున్నార‌ట‌.

ఈ ద‌శ‌లో శ్రీ‌నువైట్ల మ‌హేష్‌బాబు అప్పాయింట్ మెంట్ తీసుకోవ‌డం టాలీవుడ్ ని షాక్ నిచ్చింది. ఆగ‌డు ఫ్లాప్ త‌ర‌వాత వీరిద్ద‌రూ పెద్ద‌గా క‌లుసుకొన్న‌ది లేదు. కానీ.. సుదీర్ఘ విరామం త‌ర‌వాత మ‌హేష్‌తో శ్రీ‌నువైట్ల భేటీ అయిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. ఈ మీటింగ్‌లో శ్రీ‌నువైట్ల మ‌హేష్‌కి ఓ కథ చెప్పే ప్ర‌య‌త్నం చేశాడ‌ని.. అయితే... `క‌థ త‌ప్ప‌.. ఇంకేమైనా చెప్పండి `అని మ‌హేష్ శ్రీ‌నుకి కౌంట‌ర్ ఇచ్చాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దాంతో మ‌హేష్ ముందు కూడా శ్రీ‌నువైట్ల ప‌రువు పోగొట్టుకొన్న‌ట్టైంది. ఒక‌వేళ శ్రీ‌నువైట్ల క‌థ చెప్పినా మ‌హేష్ సినిమా చేసే స్థితిలో లేడు. మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ మ‌హేష్ ఫుల్ బిజీగా ఉంటాడు. అందుకే కొత్త క‌థ‌లు విన‌డం లేద‌ని, శ్రీ‌నువైట్ల ద‌గ్గ‌ర కూడా అదే విష‌యం చెప్పాడ‌ని మ‌హేష్ స‌న్నిహితులు చెబుతున్నారు.