English | Telugu

మెగా హీరో.. స‌హ‌జీవ‌నం చేస్తున్నాడా??

టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ హాట్ హాట్ టాపిక్ న‌డుస్తోంది. అదీ.. మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ గురించే! పిల్లా నువ్వులేనిజీవితం, రేయ్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌.. చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు సాయి. అందులో రెండు హిట్లూ వ‌చ్చాయి. ఇప్పుడు ఈ కుర్రాడు ఫుల్ బిజీ. అయితే ఇంత బిజీలోనూ ఓ ల‌వ్ స్టోరీ న‌డిపిస్తున్నాడ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.

ఓ క‌థానాయిక‌తో సాయి ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని, ఇద్ద‌రూ బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్నార‌ని, ఆ క‌థానాయిక ఓ మెగా హీరోతో సినిమా కూడా చేసింది. ఇప్పుడు వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ క‌థానాయిక అప్పుడ‌ప్పుడూ సాయి న‌టిస్తున్న సినిమా సెట్‌కీ వెళ్లొస్తుంద‌ని.. వీకెండ్ అయితే ఇద్ద‌రూ పార్టీ మూడ్‌లో మునిగి తేలుతున్నార‌ని, ఇటీవ‌ల సాయి బ‌ర్త్ డే వేడుక కూడా ఆ క‌థానాయిక స‌మ‌క్షంలోనే వైభ‌వంగా జ‌రిగింద‌ని టాక్‌.

ఈ సంగ‌తి తెలిసి అల్లు అర‌వింద్ రంగంలోకి దిగార‌ని, సాయికి న‌చ్చ‌జెప్పే ప‌నిలో ఆయ‌న బిజీగా ఉన్నార‌ని చెప్పుకొంటున్నారు. మ‌రి ఈ ప్రేమ‌క‌థ ఎందాకా వెళ్తుందో చూడాలి.