English | Telugu

ఎన్టీఆర్‌తో ఆడుకొంటున్నాడా??

ఎన్టీఆర్‌కి ఈమ‌ధ్య అన్నీ రివ‌ర్స్ కేసులో ఎదుర‌వుతున్నాయి. తన కెరీర్‌ని తీర్చిదిద్దుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న ఎన్టీఆర్ జీవితంతో ద‌ర్శ‌కులూ ఆడుకోవ‌డం మొద‌లెట్టేశారు. ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ ఏం చెబితే అది వినే ద‌ర్శ‌కులు.. ఇప్పుడు ఎన్టీఆర్‌ని కాద‌ని నిర్ణ‌యాలు తీసుకొంటున్నారు. అదేంట‌ని అడిగితే... 'నేను సినిమా చేయ‌ను.. 'అంటూ బెదిరిస్తున్నారు.

ఇప్పుడు ఎన్టీఆర్ - కొర‌టాల శివ మ‌ధ్య ఇదే తంతు న‌డుస్తోంద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శ్రీ‌మంతుడు విజ‌యం త‌ర‌వాత ఏరి కోరి కొర‌టాల‌తో సినిమాని ఫిక్స్ చేసుకొన్నాడు ఎన్టీఆర్‌. ఫారెన్‌లో షూటింగ్ చేసుకొంటున్న ఎన్టీఆర్.. షూటింగ్ ఆపి, ఫ్ల‌యిట్‌లో వ‌చ్చి, కొర‌టాల ఇంటికి వెళ్లి క‌థ‌ని ఓకే చేయించుకొన్నాడు. ఎన్టీఆరే దిగొచ్చాడు క‌దా అని కొర‌టాల అలుసుగా తీసుకొన్నాడేమో..?? త‌న సొంత నిర్ణ‌యాల‌తో ఎన్టీఆర్‌ని వెర్రెక్కిస్తున్నాడ‌ని టాక్‌. క‌థానాయిక‌లు, మిగిలిన పాత్ర‌ల ఎంపిక‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ కొర‌టాల చెప్పిన మాటే నెగ్గింది.

క‌థ‌లోనూ తాను కోరుకొన్న మార్పులు చేశాడు. అన్నీ ఇష్టారాజ్యంగా న‌డిపిస్తున్నాడ‌ట‌. ఎన్టీఆర్ అభ్యంత‌రం చెబితే ' ఈసినిమా నేను చేయ‌ను.. మ‌రో హీరోని చూసుకొంటా' అంటున్నాడ‌ట‌. దానికి మైత్రీ మూవీస్ కూడా వంత పాడుతోంది. దాంతో ఎన్టీఆర్ కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌. అయితే ఎన్టీఆర్‌లో స‌హ‌నం న‌శించింద‌ద‌ని.. కొర‌టాల ఇదే విధంగా ప్ర‌వ‌ర్తిస్తే ఈసినిమాకి గుడ్ బై చెప్పి త‌ప్పుకొంటాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెప్పుకొంటున్నారు. మ‌రి చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి.