English | Telugu

మ‌హేష్ 200 కోట్లు కొట్టేస్తాడా??

తెలుగులో వంద కోట్ల వ‌సూళ్లంటే నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఓ క‌ల‌లా ఉండేది. అయితే.. అది ఎంత తేలికో అత్తారింటికి దారేది, బాహుబ‌లి, శ్రీ‌మంతుడు నిరూపించాయి. ఇక రాబోతున్న సినిమాలూ వంద కోట్ల‌పైనే గురి పెట్టాయి. అయితే మ‌హేష్ బాబు మాత్రం రూ.200 టార్గెట్ కి ఫిక్స‌యిపోయాడు.

అవును.. త్వ‌ర‌లో మ‌హేష్ - మురుగ‌దాస్‌ల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఈ సినిమా ద్వారా మ‌హేష్ 200 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకొన్నాడట‌. 2016 ఏప్రిల్ లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కే ఈ చిత్రానికి దాదాపు రూ.వంద కోట్ల బ‌డ్జెట్ నిర్దేశించింది చిత్ర‌బృందం. మ‌హేష్ సినిమా ఇంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌డం ఇదే తొలిసారి.

రూ.150 కోట్ల గ్రాస్ తెచ్చుకొన్న శ్రీ‌మంతుడు బ‌డ్జెట్ కేవ‌లం రూ.40 కోట్లే. అయితే మురుగ‌దాస్ క‌థ‌కు ఆ మాత్రం బ‌డ్జెట్ డిమాండ్ చేస్తోంద‌ట‌. వంద కోట్ల సినిమా కాబ‌ట్టి.. టార్గెట్ రూ.200 కోట్ల‌న్న‌ది ఆల్మోస్ట్ ఫిక్స్‌. ఈ సినిమా మార్కెట్‌, ప్ర‌చారం కూడా అదే రేంజులో చేయ‌బోతున్నాడ‌ట‌. అన్న‌ట్టు ఈసినిమాలోనూ మ‌హేష్ త‌న పారితోషికాన్ని వాటాగా పెడుతున్న‌ట్టు టాక్‌. మ‌హేష్ ప్లానింగ్ చూస్తుంటే రెండొంద‌ల కోట్లూ కొట్టేసేలా ఉన్నాడు.