English | Telugu

చిరు సినిమా... ఆ మాజీ హీరోయిన్ రౌడీ

చిరంజీవి 150వ సినిమా గురించిన నిరీక్ష‌ణ కొన‌సాగుతూనే ఉంది. చిరు 150వ సినిమా చేస్తార‌ని కొంద‌రు, ఆ ఆలోచ‌న విర‌మించుకొన్నార‌ని మ‌రి కొంద‌రు చెప్తుంటారు. అయితే చిరు మ‌ళ్లీ సినిమాల్లోకి రావాలన్న‌ది ఆయ‌న అభిమానుల కోరిక‌. చిరుని అమితంగా ఇష్ట‌ప‌డే రాధిక కూడా.. చిరంజీవి మ‌ళ్లీ సినిమాల్లో న‌టించాల‌న్న కోరిక బ‌య‌టపెట్టింది.

చిరంజీవి - రాధిక‌ల‌ది హిట్ పెయిర్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలొచ్చాయి. ఇద్ద‌రూ మంచి మిత్రులు కూడా. ఓ టీవీ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాధిక చిరు 150వ సినిమా గురించి ప్ర‌స్తావించింది. చిరు 150వ సినిమా చేస్తే తాను న‌టిస్తాన‌ని, జూనియ‌ర్ ఆర్టిస్ట్ పాత్ర అయినాచేస్తాన‌ని అంటోంది రాధిక‌.

ఈ విష‌యాన్ని చిరు ద‌గ్గ‌ర కూడా ప్ర‌స్తావించింద‌ట‌. దానికి చిరు కూడా `నీకో రౌడీ పాత్ర ఇస్తా` అని స‌ర‌దాగా జోక్ చేశాడ‌ట‌. చిరు సినిమా ఇంకా ఖ‌రారు కాలేదు గానీ.. పాత్ర‌లు చేయ‌డానికి మాత్రం బోల్డంత మంది రెడీ. ఆలూ లేదూ చూలూ లేదు అంటే ఇదేనేమో..?