English | Telugu

ఎన్టీఆర్ డ‌బ్బులు జ‌ల్లేస్తున్నాడు

ఎన్టీఆర్ తాజా సినిమా నాన్న‌కు ప్రేమ‌తో కి సంబంధించిన ఓ హాటెస్ట్ న్యూస్ ఇది. ఈ సినిమాకి తెర వెనుక పెట్టుబ‌డి పెడుతోంది.. ఎన్టీఆరేన‌ట‌. నిజానికి ఈ సినిమాకి బీవీఎస్ ఎన్‌ప్ర‌సాద్ నిర్మాత‌. ఆల్రెడీ ఈ సినిమా ఓవ‌ర్ బ‌డ్జెట్ అయిపోయింద‌ట‌. రూ.40 కోట్ల‌తో సినిమా మొద‌లెడితే ఇప్పటికే రూ.48 కోట్లు అయ్యింద‌ట‌. ఇక నేను డ‌బ్బులు పెట్ట‌లేను అని నిర్మాత చేతులెత్తేసిన‌ట్టు టాక్‌. దాంతో సినిమా ఆగిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌ట‌.

ఈ సినిమాని చాలా ప్రెస్టేజియ‌స్ గా తీసుకొన్న ఎన్టీఆర్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా ఆగిపోకూడ‌ద‌న్న ఉద్దేశంతో త‌న సొంత డ‌బ్బుల్ని పెట్టుబ‌డిగా పెడుతున్నాడ‌ని టాక్‌. పైగా సీన్లు మ‌రీ రిచ్ గా రావ‌డానికి డ‌బ్బుని వెద‌జ‌ల్లుతున్నాడ‌ట‌. `మీరేం డ‌బ్బుల కోసం ఆలోచించొద్దు. సినిమా బ‌డ్జెట్ పెరిగినా ఫ‌ర్వాలేదు` అని నిర్మాత‌కు చెబుతున్నాడ‌ట‌.

కొన్ని ఏరియాల బ‌య్య‌ర్ల‌తో మాట్లాడి.. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్‌కు ముందస్తు అడ్వాన్సులు ఇప్పించాడ‌ని టాక్‌. అందుకే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌చ్చినా షూటింగ్ నిరాటంకంగా సాగుతోంద‌న్న‌మాట‌. సినిమా పూర్త‌య్యాక‌.. తెర‌పై నిర్మాత‌గా త‌న పేరు వేసుకోక‌పోయినా.. వెన‌కుండి న‌డిపిస్తున్న‌దంతా ఎన్టీఆరే అన్న‌మాట‌.