English | Telugu

మ‌హేశ్ వ‌ర్సెస్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌రిలో గురుశిష్యులు!

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `లైగ‌ర్` చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత పూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. కాగా, ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ స్పోర్ట్స్ డ్రామా వ‌చ్చే ఏడాది తెర‌పైకి రానుంది.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 1న `లైగ‌ర్`ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో విజ‌య్ దేవ‌ర‌కొండ పోటీకి దిగుతున్న‌ట్లే. ఎందుకంటే.. స‌రిగ్గా అదే రోజున మ‌హేశ్ తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌` రాబోతోంది. ఇప్ప‌టికే దీని తాలూకు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. `స‌ర్కారు వారి పాట‌` ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పూర్వాశ్ర‌మంలో పూరికి శిష్యుడు. సో.. ఏప్రిల్ 1న గురుశిష్యులు పూరి, ప‌ర‌శురామ్ బ‌రిలోకి దిగ‌బోతున్నార‌న్న‌మాట. త్వ‌ర‌లోనే `లైగ‌ర్` రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌స్తుంది. అది వ‌చ్చాకే ఈ పోటీ ముచ్చ‌ట అధికారిక‌మ‌వుతుంది. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో!