English | Telugu

స‌మంత‌కు ఇంట‌ర్నేష‌నల్ ప్రాజెక్ట్ రావ‌డానికి కార‌ణం.. రానా!

నాగ‌చైత‌న్య‌తో విడిపోయాక కెరీర్ విష‌యంలో స్పీడు పెంచింది స‌మంత‌. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ వ‌స్తోన్న ఆమె, ఇటీవ‌ల ఒక ఇంట‌ర్నేష‌నల్ ప్రాజెక్టును చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేసి, అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. 'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్' అనే ఆ మూవీని బాఫ్టా అవార్డ్ విజేత ఫిలిప్ జాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో సొంతంగా డిటెక్టివ్ ఏజెన్సీని న‌డిపై ఒక బైసెక్సువ‌ల్‌గా స‌మంత క‌నిపించ‌నుంది.

'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్' మూవీలోని పాత్ర‌కు స‌మంత ఆడిష‌న్‌ను ఎదుర్కొంది. చివ‌రిసారిగా ఆమె 12 ఏళ్ల క్రితం 'ఏమాయ చేశావే' మూవీ కోసం ఆడిష‌న్‌కు వెళ్లింది. కాగా ఈ ప్రాజెక్ట్ స‌మంత‌కు రావ‌డంలో టాలీవుడ్‌కు చెందిన ఓ పాపుల‌ర్ యాక్ట‌ర్ తోడ్ప‌డ్డాడు. అత‌నెవ‌రో కాదు.. రానా ద‌గ్గుబాటి! అవును. 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్' మూవీలో మెయిన్ లీడ్‌కు ఎవ‌ర్ని తీసుకోవాలా అని నిర్మాత సునీత తాటి అన్వేషిస్తున్న‌ప్పుడు, స‌మంత పేరును రానా సూచించాడ‌ని టాలీవుడ్‌లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. నాగ‌చైత‌న్య‌తో స‌మంత విడిపోయిన‌ప్ప‌టికీ రానా, స‌మంత మ‌ధ్య స్నేహానికి అదేమీ అడ్డు కాలేదు. ఇప్ప‌టికీ ఆ ఇద్ద‌రి మ‌ధ్య మంచి రాపో ఉంది.

Also read:బైసెక్సువ‌ల్‌గా బోల్డ్ రోల్‌లో స‌మంత‌!

"బాఫ్టా అవార్డు గెలుచుకున్న‌, మీ మోస్ట్ ఫేవ‌రేట్ సిరీస్ 'డౌన్‌ట‌న్ అబ్బే'ని తీసిన విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ద‌ర్శ‌కుడు ఫిలిప్ జాన్ స‌ర్ న‌న్ను ఎంచుకున్నందుకు ఆనందంతో గెంతుతున్నా.. ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు సునీత తాటి, గురు ఫిలిమ్స్‌కు థాంక్స్‌. ఈ ఉత్తేజ‌క‌ర‌మైన ప్ర‌యాణాన్ని స్టార్ట్ చేయ‌డం కోసం ఎదురుచూస్తున్నా." అని తెలిపింది స‌మంత‌.