English | Telugu

మహేష్ 'శ్రీమంతుడు' మాయ చేస్తాడా?

తెలుగు సినిమా ప్రేక్షకులు మొత్తం బాహుబలి ఫీవర్ లో ఊగిపోతున్నారు. రాజమౌళి చెక్కిన ఈ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా రికార్డులన్నీ కొల్లగొట్టేసిందంటూ ఒక్కటే ప్రచారం. ఇక అలాంటి సినిమాలు రావాలంటే మూడేళ్లకు ఒకటి వస్తుంది కాని రెగ్యులర్ గా పాజిబిలిటీ లేదని కూడా అందరికీ తెలుసు. కాని స్టిల్ బాహుబలి టాపిక్ వచ్చిందంటే చాలు జనాలు పూనకంతో ఊగిపోతున్నారు. ఈ దెబ్బకి ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

ఇప్పుడు ఆ ఫీవర్ తాలూకు సెగలను మర్చిపోయేలా చేయడానికి ఒక హిట్ సినిమా అవసరం. అయితే ఆ హిట్ మన 'శ్రీమంతుడు' వల్లే అవుతుందని ఇండస్ట్రీ వర్గాల నమ్మకం. ఈ రోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపుకోబోతున్న 'శ్రీమంతుడు' తన ఫీవర్ తో సినీ ప్రేక్షకులను నార్మల్ సినిమా లోకానికి తీసుకురాగలడని భావిస్తున్నారు. మరి బాహుబలి ఫీవర్ సినీ జనాలపై ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియాలంటే, శ్రీమంతుడు వచ్చే వరకు ఆగాల్సిందే!!