English | Telugu

శంకర్ 'రోబో 2' షాకింగ్ బడ్జెట్!!

శంకర్ ఈ డైరెక్టర్ పేరు తెలియని సినిమా అబిమాని ఉండడు..సంచలన చిత్రాలు తీస్తూ , ఎప్పటికప్పుడు తనకంటూ ఓ మార్క్ తో దూసుకపోతూ, కోలీవుడ్ , టాలీవుడ్ , బాలీవుడ్ ఇలా అన్ని భాషలలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. అతని లాస్ట్ మూవీ ‘ఐ’ బాక్స్ ఆఫీసు దగ్గర ఫ్లాప్ కాస్త నిరాశకు గురయ్యాడు. దీంతో మళ్ళీ భారీ బడ్జెట్ చిత్రం తీసి తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యారట.

త్వరలో రజనీకాంత్ తో చేయబోయే రోబో 2 చిత్రం కోసం ఏకంగా 300 కోట్ల బడ్జెట్ పెట్టాలని నిర్మాతలకు చెప్పాడట. ఈ చిత్రాన్ని లైక ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించబోతుంది. శంకర్ చెప్పిన బడ్జెట్ చూసి ‘ఐ’ సినిమాని గుర్తు చేసుకుంటున్నారట చిత్ర నిర్మాతలు. బాహుబలి 250 కోట్ల బడ్జెట్ అంటే సినిమాలో సత్తా ఉంది కాబట్టి అంత బడ్జెట్ పెట్టారు కానీ రోబో 2 కు అంత బడ్జెట్ అవసరమా అని మరి కొందరు కోలీవుడ్ అగ్ర నిర్మాతలు అనుకుంటున్నారట. మరి శంకర్ చెప్పిన బడ్జెట్ కు ఓకే అంటారో లేదో కొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.