English | Telugu
బాహుబలిలో కొత్త సీన్లు?
Updated : Jul 16, 2015
బాహుబలి ఓ విజువల్ వండర్ అన్నది అందరి మాట. అయితే.. క్లైమాక్స్ అర్థాంతరంగా వచ్చిపడిపోయిందన్న అసంతృప్తి అందరి నుంచీ వ్యక్తం అవుతోంది. సెకండాఫ్ గురించి ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఇళ్లకు పంపించేశారని పెదవి విరుస్తున్నారు. వాళ్లందరి కోసం క్లైమాక్స్ కాస్త పొడిగిస్తూ... కొత్త సీన్లు జోడించబోతున్నట్టు వార్తలొస్తున్నాయ్. పార్ట్ 2లోని కొన్ని షాట్స్‌ని క్లైమాక్స్‌ని జత చేరుస్తున్నారట. పార్ట్ 2 ఇలా ఉండబోతోంది అనే హింట్‌ని దీని ద్వారా రాజమౌళి ఇవ్వబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ షాట్స్ కోసమైనా.. జనాలు మళ్లీ థియేటర్లకు పరుగులు తీయడం ఖాయం. ఇప్పటికే బాహుబలి సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. చరిత్ర లిఖిస్తోంది. మరి ఈ సీన్లు వల్ల ఇంకెన్ని కలెక్షన్లు వస్తాయో చూడాలి.