English | Telugu
బజ్ : కమల్ - మహేశ్ మల్టిస్టారర్?
Updated : Jun 3, 2021
గతంలో సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ తో కలిసి `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013) అనే ఓ మల్టిస్టారర్ మూవీ చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కట్ చేస్తే.. భారీ విరామం తరువాత మరో మల్టిస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట మహేశ్. ఈ సారి లోకనాయకుడు కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట ఈ ఘట్టమనేని వారి హ్యాండ్సమ్ హీరో.
ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ కెప్టెన్ ఎ.ఆర్. మురుగదాస్ ఇటీవల ఓ స్క్రిప్ట్ ని తయారు చేసుకున్నారట. ఇదో మల్టిస్టారర్ సబ్జెక్ట్ అని సమాచారం. ముగ్గురు కూతుళ్ళ తండ్రికి, ఓ సీబీఐ ఆఫీసర్ కి మధ్య సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. అంతేకాదు.. సబ్జెక్ట్ నచ్చడంతో తండ్రి పాత్రలో లోకనాయకుడు కమల్ హాసన్, ఆఫీసర్ పాత్రలో మహేశ్ నటించేందుకు అంగీకరించారని వినికిడి. అలాగే కథలో కీలకమైన లాయర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ దర్శనమివ్వనుందట. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ ఇప్పటికే `స్పైడర్` (2017) చేయగా.. కమల్ కి ఇదే మొదటి సినిమా కానుంది. అలాగే కమల్, మహేశ్ కాంబినేషన్ లో ఇదే తొలి మల్టిస్టారర్ కానుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానున్నది.