English | Telugu
బయ్యర్లను బెదరగోడుతున్న మహేష్ బాబు
Updated : Sep 22, 2015
ఓవర్సీస్ లో తనకు సాటిలేరని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సార్లు నిరూపించాడు. ఈ సూపర్ స్టార్ సినిమాలు అక్కడ అత్యధిక సంఖ్యలో మిలియన్ డాలర్స్ ను కొల్లగొట్టాయి. అయితే అతని సినిమా అక్కడ ఫ్లాప్ కాలేదని కాదు.. ఈ సూపర్ స్టార్ సినిమాలు కూడా అక్కడ బయ్యర్లకు చుక్కలు చూపించిన సందర్బాలు ఎన్నో వున్నాయి.
లేటెస్ట్ గా శ్రీమంతుడు సినిమాతో నిర్మాతగా మారిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి లాభాలను రాబట్టుకున్నారు. అయితే తన హిట్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న మహేష్ బాబు ఓవర్సీస్ రైట్స్ కి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నాడట. 'బ్రహ్మోత్సవం' సినిమాకి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న మహేష్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కావాలంటే 13 కోట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నాడట. బయ్యర్లు ఆగడు, 1 నేనొక్కడినే సినిమాలను గుర్తు చేయగా..ఇది ఖచ్చితంగా బ్లాక్ బ్లాస్టర్ సినిమా అని చెబుతున్నాడట.
ఓవర్సీస్ మార్కెట్ ఎప్పుడూ.. ఏ సినిమా ఆడుతుందో చెప్పడం కష్టమని, అలాంటి అప్పుడు ఈ సినిమాకి అంత భారీ మొత్తం చెల్లించలేమని చెప్పి బయ్యర్లు వెన్నక్కి వెళ్ళిపోతున్నారట. ఓ హిట్ సినిమా చూసి బయ్యర్లు బిత్తరపోయె రెంజులో ధరలు చెప్పడం కూడా భావ్వం కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు మాట్లాడుకొని ఓ రేటు పిక్స్ చేసుకుంటే తప్ప ఈ సినిమా ఓవర్సీస్ అమ్ముడవడం కష్టమేనని అంటున్నారు.