English | Telugu

మహేష్ సర్ ప్రైజ్ ఇస్తే మైండ్ బ్లాకే!!

ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అలాగే ఎవరు సర్ ప్రైజ్ ఇస్తే కూడా మైండ్ బ్లాక్ అవుద్దో అతనే మన సూపర్ స్టార్ మహేష్. అవునండీ మహేష్ కొడితేనే కాదు సర్ ప్రైజ్ ఇచ్చిన మైండ్ బ్లాక్ అవుద్దీ. ‘శ్రీమంతుడు’ లాంటి మరపురాని సినిమాను తనకందించిన డైరెక్టర్ కొరటాలకు మహేష్ బాబు దిమ్మదిరిగిపోయేలా సడెన్ సర్ ప్రైజ్ అందించాడు. కొరటాలకు లగ్జీరియస్ ఆడి-6 కారును మహేష్ బహుమతిగా ఇచ్చాడు.. ఈ కారు విలువ రూ.50 లక్షలు!! ఆదివారం రాత్రి విషయం చెప్పకుండా కొరటాలకు ఫోన్ చేసి షో రూంకి పిలిపించాడట మహేష్. అక్కడికొచ్చాక కారు చూపించి తాళాలు చేతిలో పెట్టేశాడట. దీంతో కొన్ని నిమిషాలు కొరటాలకు ఏమీ పాలుపోలేదట. ఆ సమయంలో మహేష్ భార్య నమ్రత కూడా అక్కడే ఉందట. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయిన కొరటాల కొన్ని నిమిషాల తర్వాతే తేరుకున్నాడట. మరి మహేశా..మజాకా..!!