English | Telugu

మ‌హేశ్, జ‌క్క‌న్న‌.. ముహూర్తం ఫిక్స్?

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` చేస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు మ‌హేశ్. 2022 వేస‌వికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయాల‌న్న‌ది మ‌హేశ్ ఆలోచ‌న‌.

కాగా, ఎప్ప‌టినుండో వార్త‌ల్లో ఉన్న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబో మూవీని కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట మ‌హేశ్. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. విజ‌య‌ద‌శ‌మి
ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా మ‌హేశ్, రాజ‌మౌళి ఫ‌స్ట్ కాంబో మూవీ ప‌ట్టాలెక్క‌నుందని తెలిసింది‌. కుదిరితే న‌వంబ‌ర్ నుంచి లేదంటే 2022 ఆరంభంలో రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళి.. 2023 సంక్రాంతికి సినిమాని
జ‌నం ముందుకు తీసుకొచ్చేలా ప్ర‌ణాళిక జ‌రుగుతోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, ప్ర‌స్తుతం జ‌క్క‌న్న `ఆర్ ఆర్ ఆర్` చేస్తున్నారు. యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న ఈ మ‌ల్టిస్టార‌ర్ ని అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు
జ‌రుగుతున్నాయి.