English | Telugu
లవ్‌లో లావణ్య త్రిపాఠీ.... హీరో ఎవరు??
Updated : Aug 3, 2016
ఈమధ్య వరుస సినిమాలతో దూసుకుపోతోంది లావణ్య త్రిపాఠి. అటు నాగార్జున లాంటి సీనియర్ మోస్ట్ హీరోలతో నటిస్తూనే...ఇటు శిరీష్ లాంటి జూనియర్లతోనూ జోడీ కట్టేస్తోంది. చిన్న సినిమాలకూ... పెద్ద సినిమాలకూ అందుబాటులో ఉండే ఏకైక హీరోయిన్ అనే గుర్తింపు తెచ్చుకొంది. అందుకే లావణ్య బిజీ హీరోయిన్ అయిపోయింది. లావణ్య చేతినిండా సినిమాలే ఇప్పుడు. ఇంత బిజీలోనూ కాస్త తీరిక చేసుకొని ఓ యువ హీరోని ఎడా పెడా ప్రేమించేస్తోందని టాక్. ఆ హీరోకి హిట్లేం లేవు. కాకపోతే లావణ్యతో ఓ సినిమా చేశాడు. పైగా ఆ హీరో బ్యాక్ గ్రౌండ్ సూపరో సూపర్. బోల్డంత ఆస్తి, పలుకుబడి ఉంది. అందుకే.. లావణ్య లవ్‌లో పడిపోయిందట. ఆ హీరో రికమెండేషన్ పైనే సినిమాలూ దక్కించుకొంటోందట. మరి ఆ హీరో ఎవరై ఉంటారూ..? అని టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నెలకొంది. మరోవైపు లావణ్య మాత్రం ఈ విషయంలో గోప్యత పాటిస్తోంది. సమంతలా... బయటపడకుండా ఈ లవ్ మేటర్‌ని లోలోపలే దాచుకొంటోందట. ఆ హీరో కూడా... లావణ్య లవ్ మేటర్ బయటకు పొక్కకుండా తన జాగ్రత్తల్లో తాను ఉన్నాడట. అయినా సరే.. మేటర్ బయటపడిపోయింది. అయితే లావణ్య మాత్రం ''నేను ప్రేమలో పడడమేంటి.. నెవ్వర్'' అంటూ రొటీన్ గానే సమాధానం చెబుతోంది. అంటే ఈ లవ్వాట కాలక్షేపం కోసమేనా?? ఆ సంగతి వాళ్లిద్దరికే తెలియాలి.