English | Telugu

ప్ర‌భాస్ `ప్రాజెక్ట్ కె`.. మిక్కీ స్థానంలో మ‌రొక‌రు?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేతిలో ఉన్న పాన్ - ఇండియా మూవీస్ లో `ప్రాజెక్ట్ కె` ఒక‌టి. `మ‌హాన‌టి` త‌రువాత నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీని ప్ర‌ముఖ నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్ట‌నున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. ఏక‌ధాటిగా షూటింగ్ జ‌రుపుకుని 2023 వేస‌విలో వినోదాలు పంచ‌నుంది. `బిగ్ బి` అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ కి జంట‌గా బాలీవుడ్ దివా దీపికా ప‌దుకోణ్ సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి యువ సంగీత ద‌ర్శ‌కుడు మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందించ‌బోతున్న‌ట్లు చాలా కాలం క్రిత‌మే ప్ర‌క‌టించారు మేక‌ర్స్. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. మిక్కీ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ని.. త‌న‌కి బ‌దులుగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోష్ నారాయ‌ణ్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.

కాగా, `పిజ్జా` (2012)తో పాపుల‌ర్ అయిన సంతోష్ నారాయ‌ణ్.. తెలుగులో విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించిన `గురు`(2017)కి సంగీత‌మందించాడు. అలాగే నేచురల్ స్టార్ నాని న‌టిస్తున్న `ద‌స‌రా`కి కూడా సంతోష్ నే స్వ‌ర‌క‌ర్త‌.