English | Telugu
పూరితో కాదు.. బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా!
Updated : Sep 27, 2022
డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తో 'వెంకీ మామ' చేసిన బాబీ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'(మెగా 154) చేస్తున్నాడు. ఆ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ కి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల అనిల్ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశముందని న్యూస్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో బాలయ్య ఓ చిత్రాన్ని అంగీకరించాడని, దానికి బాబీ దర్శకుడిగా వ్యవహరించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగాయని, 'మెగా 154' పూర్తయ్యాక బాబీ పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ ని సిద్ధం చేయనున్నాడని సమాచారం.
బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా వార్త నిజమైతే.. నలుగురు సీనియర్ హీరోలలో బాబీ వర్క్ చేయాల్సిన హీరోగా కింగ్ నాగార్జునే మిగులుతాడు. మరి బాలయ్య ప్రాజెక్ట్ తర్వాత నాగ్ సినిమాని పట్టాలెక్కించి.. నలుగురు సీనియర్ హీరోలతో వర్క్ చేసిన దర్శకుడిగా బాబీ పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి.