English | Telugu

విజ‌య్ దేవ‌ర‌కొండతో కృతి సన‌న్?

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు - బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `1 నేనొక్క‌డినే`(2014)తో క‌థానాయిక‌గా తొలి అడుగేసింది కృతి స‌న‌న్. ఆపై బాలీవుడ్ వైపు దృష్టి సారించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. మ‌ధ్య‌లో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య తో `దోచేయ్` (2015) అంటూ సంద‌డి చేసింది. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న‌ పాన్ - ఇండియా మూవీ `ఆదిపురుష్`లో సీత పాత్ర‌లో న‌టిస్తోంది కృతి.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో తెలుగు హీరోతో జ‌ట్టుక‌ట్టేందుకు మిస్ స‌న‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సుకుమార్ కాంబోలో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. 2022 ఆరంభంలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ వెంచ‌ర్ లో హీరోయిన్ గా కృతి స‌న‌న్ ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట సుక్కు. త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు నుంచి వ‌చ్చిన ఆఫ‌ర్ కావ‌డంతో కృతి కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే రౌడీ హీరో సినిమాలో కృతి స‌న‌న్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.