English | Telugu

మ‌రోసారి 'ఫిదా' పోరి-పోర‌డు!

'ఛ‌లో', 'భీష్మ‌'తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు యువ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ కెప్టెన్ త‌న‌ మూడో చిత్రాన్ని మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వ‌రుణ్‌కి జోడీగా డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌విని సెలెక్ట్ చేశార‌ని టాక్. అదే గ‌నుక నిజ‌మైతే.. 'ఫిదా' వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత వ‌రుణ్, ప‌ల్ల‌వి కాంబోలో రానున్న సినిమా ఇదే అవుతుంది. ఆ ఇద్ద‌రి జోడీని మ‌రోసారి చూడాల‌ని వారి ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ చేతిలో 'ఎఫ్ 3', 'గ‌ని' చిత్రాలు ఉన్నాయి. 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా రూపొందుతున్న 'ఎఫ్ 3'లో విక్ట‌రీ వెంక‌టేశ్ తో క‌లిసి మ‌రోసారి సంద‌డి చేయ‌నున్నారు వ‌రుణ్. అలాగే మెహ‌రీన్ తో ఇంకోసారి ఆడిపాడనున్నారు. ఇక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న 'గ‌ని'లో స‌యీ మంజ్రేక‌ర్ తో జోడీక‌ట్టారు వ‌రుణ్.

సాయిప‌ల్ల‌వి విష‌యానికి వ‌స్తే.. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో జ‌ట్టుక‌ట్టిన 'ల‌వ్ స్టోరి', ద‌గ్గుబాటి స్టార్ రానాతో జోడీక‌ట్టిన 'విరాట ప‌ర్వం' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి 'శ్యామ్ సింగ రాయ్'లో న‌టిస్తోంది.