English | Telugu

నితిన్ తో `ఉప్పెన‌` బ్యూటీ?

`చెక్`, `రంగ్ దే`.. ఇలా నెల రోజుల గ్యాప్ లో రెండు విభిన్న‌మైన చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు యూత్ స్టార్ నితిన్. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో.. `అంధాధున్`కి రీమేక్ గా తెర‌కెక్కుతున్న `మాస్ట్రో`లో న‌టిస్తున్నాడు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా న‌భా న‌టేశ్ న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 11న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. `మాస్ట్రో` త‌రువాత `నా పేరు సూర్య‌` ఫేమ్ వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్ లో నితిన్ ఓ మూవీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తోనూ జట్టుక‌ట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అదే గ‌నుక నిజ‌మైతే.. `హార్ట్ ఎటాక్` (2014) త‌రువాత నితిన్, పూరి కాంబోలో వ‌చ్చే సినిమా ఇదే అవుతుంది. కాగా, ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా `ఉప్పెన‌` బ్యూటీ కృతి శెట్టి న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మ‌రి.. ఈ వార్త‌ల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.