English | Telugu
పవన్ సినిమాలో కృతి.. ఈ సారి సాయితేజ్ జోడీ!?
Updated : Mar 19, 2022
సంచలన చిత్రం `ఉప్పెన`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కృతి శెట్టి. ఇందులో మెగా కాంపౌండ్ కి చెందిన వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించి ఆకట్టుకుంది కృతి. వైష్ణవ్ కి కూడా హీరోగా అదే మొదటి సినిమా కావడం విశేషం. `ఉప్పెన` తరువాత ఈ ఇద్దరు కూడా వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోయారు.
ఇదిలా ఉంటే, `ఉప్పెన` తరువాత మళ్లీ మెగా క్యాంప్ లో మరో చిత్రం చేయని కృతి శెట్టి.. త్వరలో ఆ దిశగా అడుగులు వేయబోతోందట. ఈ సారి.. వైష్ణవ్ తేజ్ అన్న సాయి తేజ్ కి జోడీగా కృతి దర్శనమివ్వనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. తమిళ చిత్రం `వినోదయ సిత్తమ్` ఆధారంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబోలో ఓ మల్టిస్టారర్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా కోసమే సాయితేజ్ సరసన కృతి శెట్టిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే పవన్, సాయితేజ్ కాంబో మూవీలో కృతి శెట్టి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. వైష్ణవ్ కి జంటగా బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి.. అతని అన్న సాయితేజ్ తోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.