English | Telugu
చరణ్ తో సముద్రఖని చిత్రం!?
Updated : Mar 17, 2022
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేసవిలో రెండు సినిమాలతో సందడి చేయనున్నారు. మార్చి 25న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన `ఆర్ ఆర్ ఆర్` విడుదల కానుండగా.. ఏప్రిల్ 29న తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో జట్టుకట్టిన `ఆచార్య` ఎంటర్టైన్ చేయనుంది. ఈ రెండు చిత్రాల కోసం చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీ చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావచ్చని టాక్. మరోవైపు `జెర్సీ` కెప్టెన్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చరణ్ చేయబోతున్న సినిమా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అంతేకాదు.. ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్ర ఖని డైరెక్షన్ లోనూ ఈ కొణిదెల స్టార్ ఓ మూవీ చేయబోతున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని బజ్. మొత్తమ్మీద.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ లైనప్ తోనే ముందుకు సాగుతున్నారన్నమాట.