English | Telugu
చరణ్ చేయాల్సిన సినిమా.. వరుణ్‌తోనా??
Updated : Sep 18, 2015
క్రిష్ తాజా ప్రయత్నం.. కంచె. మెగా హీరో వరుణ్ తేజ్ కి ఇది రెండో సినిమా. ఈ కథ వరుణ్‌కి చెప్పకముందు క్రిష్ రామ్‌చరణ్‌కి వినిపించాడా? రామ్‌చరణ్ ఈ పాత్రకు సెట్ కాడన్న ఉద్దేశంతో వరుణ్ తేజ్‌తో లాగించేశాడా?? కంచె ఆడియో ఫంక్షన్ లో రామ్‌చరణ్ స్పీచ్ వింటే అదే అనిపిస్తోంది. క్రిష్‌కీ చరణ్‌కీ ఐదేళ్ల స్నేహమట. ఐదేళ్ల నుంచీ క్రిష్‌తో సినిమా చేయాలని చరణ్ భావిస్తున్నాడట. ఓ రోజు క్రిష్ చరణ్‌కి కథ కూడా వినిపించాడట. అయితే సగం కథ చెప్పి వెళ్లిపోయాడట. అదే.. ఈ కంచె సినిమా అని చరణ్ ఇప్పుడు డౌటు పడుతున్నాడు. నాకు చెప్పిన కథనే వరుణ్‌తో చేస్తే.. నా చేతులో క్రిష్ అయిపోతాడు అంటూ కంచె ఆడియోలో జోకేశాడు చరణ్. అయితే.. ఇది వరుణ్‌ని దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న కథ అని క్రిష్ చెబుతున్నాడు. క్రిష్‌తో ఓ సినిమా చేయాలన్న రామ్‌చరణ్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ఒకవేళ కంచెగనుక సూపర్ హిట్టయితే.. చరణ్ వెంటనేకర్చీఫ్ వేసేయడం ఖాయం.