English | Telugu

త్రివిక్రమ్ రూట్ మారిందా? లేదా?

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ అనగానే అందరికీ ఆసక్తి కలిగింది. నితిన్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు? అతడి ఏజ్కి తగ్గట్టే యూత్ ఫుల్ కంటెంట్ తో తీస్తున్నాడా? అతడిని లవర్ బోయ్ గానే చూపిస్తున్నాడా? అన్న డిష్కసన్ సాగింది. ఇటీవలి కాలంలో అతడు తీస్తున్న సినిమాలన్నీ ఫ్యామిలీ కంటెంట్ తో కూడుకున్నవే .. మినహా యూత్ ని కిక్కెక్కించే కంటెంట్ వీటిల్లో లేనేలేదు. ఓ పక్కా లవ్ స్టోరీని తెరకెక్కించిందే లేదు. కాబట్టి ఈసారి రూట్ మారుస్తాడనే అనుకున్నారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ఎంచుకుంటున్న నటీనటుల్ని బట్టి అతడు మరోసారి ఫ్యామిలీ సినిమా తీసేట్టే ఉన్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి త్రివిక్రమ్ ఈ సారి రూట్ మారుస్తాడా లేక రెగ్యులర్ టైపికల్ స్టోరీనే నమ్ముకుంటాడా అన్నది తెలియాల్సి వుంది.