English | Telugu

ఎన్టీఆర్‌ బాలకృష్ణ సంక్రాంతి వార్..!!

టాలీవుడ్ తెర మీద సంక్రాంతి సీజన్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది.. అందుకే బడా బడా స్టార్ హీరోలు కూడా సంక్రాంతి బరిలో సత్తా చాటాలని భావిస్తుంటారు.. వచ్చే ఏడాది సంక్రాంతి వార్ మరింత రసవత్తరంగా మారనుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల మధ్య బాక్సాఫీస్‌ వార్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో'.. బాలకృష్ణ 'డిక్టేటర్‌' సంక్రాంతికి పొటీ పడబోతున్నాయి. ఒకప్పుడు బాబాయ్‌, అబ్బాయ్‌ కలిసి కనిపించినా కానీ ఈమధ్య ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకోవడం లేదు.ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పోటీ నందమూరి అభిమానుల పరంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు సినిమాల్లో దేనిది పైచేయి అవుతుందో అనే ఆసక్తి అభిమానుల్లోనే కాక ఇతరుల్లో కూడా బాగా కనిపిస్తోంది.