English | Telugu
`అర్జున్ రెడ్డి`తో `కబీర్ సింగ్` భామ రొమాన్స్!?
Updated : Feb 22, 2022
`అర్జున్ రెడ్డి`తో టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ఇక అదే సినిమా తాలూకు హిందీ వెర్షన్ `కబీర్ సింగ్`తో బాలీవుడ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది కియారా అద్వాని. అలా.. ఒకే దర్శకుడు రూపొందించిన చిత్రాలతో ఫ్యాన్ బేస్ పెంచుకున్న ఈ యూత్ స్టార్స్.. త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో జోడీగా సందడి చేయనున్నారట.
Also Read:అప్పుడు నిర్మాణం.. ఇప్పుడు దర్శకత్వం..
ఆ వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో `లైగర్`ని పూర్తిచేశాడు విజయ్. ఆగస్టు 25న సదరు స్పోర్ట్స్ డ్రామా తెరపైకి రానుంది. ఈలోపే పూరి దర్శకత్వంలోనే `జన గణ మన`లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కిందని బజ్. కాగా `నిన్ను కోరి`, `మజిలీ` చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో ఆపై నెక్స్ట్ వెంచర్ చేయనున్నాడు దేవరకొండ స్టార్. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో విజయ్ కి జంటగా కియారా నటించే అవకాశముందని టాక్. త్వరలోనే విజయ్ - శివ కాంబో మూవీలో కియారా ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
Also Read:సమంత 'శాకుంతలం' నుంచి కీలక అప్డేట్
మరి.. `అర్జున్ రెడ్డి` హీరోతో `కబీర్ సింగ్` హీరోయిన్ చేయనున్న రొమాన్స్.. వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.