English | Telugu

`స్పిరిట్`.. నెగ‌టివ్ షేడ్స్ తో క‌రీనా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - `అర్జున్ రెడ్డి` కెప్టెన్ సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్ లో `స్పిరిట్` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ, త‌మిళ్, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, జ‌ప‌నీస్, చైనీస్, కొరియ‌న్ భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ పాన్ - వ‌ర‌ల్డ్ మూవీలో ప్ర‌భాస్ ఓ సూప‌ర్ కాప్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్ట‌నున్న ఈ సినిమాని యూవీ క్రియేష‌న్స్, టీ-సిరీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. ప్ర‌భాస్ కెరీర్ లో సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా `స్పిరిట్` సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `స్పిరిట్`లో బాలీవుడ్ దివా క‌రీనా క‌పూర్ న‌టించ‌బోతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న రోల్
లో ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ క‌నిపించ‌నుంద‌ట‌. సినిమా హైలైట్స్ లో క‌రీనా క్యారెక్ట‌రైజేష‌న్ కూడా ఒక‌ట‌ని టాక్. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. అన్న‌ట్టు.. `ఆదిపురుష్`లో ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా.. క‌రీనా భ‌ర్త సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడిగా నెగ‌టివ్ రోల్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న విష‌యం విదిత‌మే.