English | Telugu

కాజ‌ల్‌ని న‌గ్నంగా న‌టించ‌మ‌న్నారా??

ఈత‌రం హీరోయిన్లు డ‌బ్బుల కోసం ఏమైనా చేస్తుంటారు! లిప్‌లాక్‌లూ, బికినీలూ, బెడ్ రూమ్‌స‌న్నివేశాలు.. ఒక్క‌టేమిటి?? ఎన్ని హ‌ద్దులుదాట‌డానికైనా రెడీనే. కాస్త పారితోషికం ఎక్కువ ఇస్తామంటే చాలు.. బోల్డ్‌గా న‌టించ‌డానికి రెడీ అంటుంటారు. అయితే క‌థానాయిక‌లంతా ఇలానే ఉండ‌రు. కొంత‌మంది ఎంతిచ్చినా.. కొన్ని హ‌ద్దులు దాట‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌రు. కాజ‌ల్ కూడా అంతే. ప‌దేళ్ల నుంచీ త‌న ప్ర‌స్థానాన్ని దిగ్విజ‌యంగా న‌డిపిస్తోంది కాజ‌ల్‌. ఇన్ని సినిమాలు చేసినా... ఒక్క‌సారి హ‌ద్దులు దాటిన దాఖ‌లాలు లేవు. అయితే ఈమ‌ధ్య బాలీవుడ్‌లో కాజ‌ల్‌కి ఓ అద్భుత‌మైన అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. స్టార్ హీరో, పెద్ద ద‌ర్శ‌కుడు, పేరున్న సంస్థ‌.. కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోయే చిత్రంలో కాజ‌ల్‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. పారితోషికం కూడా ఊహించ‌నంత ఇస్తామ‌ని ఆశ‌పెట్టారు.

అయితే.. వాళ్లు విధించిన ష‌ర‌తు ఒక్క‌టే. ఒక‌ట్రెండు స‌న్నివేశాల్లో న‌గ్నంగా న‌టించాల్సివ‌స్తుంద‌ని అన్నార‌ట‌. అదీ.. వీపు భాగ‌మే చూపిస్తామ‌ని మాట కూడా ఇచ్చార‌ట‌. కానీ.. కాజ‌ల్ అందుకు ఒప్పుకోలేద‌ని తెలుస్తోంది. కోట్లు ధార‌బోసినా తాను న‌గ్మంగా న‌టించ‌న‌ని మొహం మీదే చెప్పేసింద‌ట‌. ఇలాంటి ప్ర‌తిపాద‌న‌ల‌తో ఎప్పుడూ నా ద‌గ్గ‌ర‌కు రాకండి.. అని వార్నింగ్ ఇచ్చింద‌ట‌. దాంతో స‌ద‌రు నిర్మాత‌లు షాక్ తిన్నార‌ట‌. ఇంత పారితోషికం ఇస్తామ‌న్నా, కాజ‌ల్ ఇంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వ‌డం వాళ్లు ఊహించ‌లేద‌ట‌. కాజ‌ల్ నో అన్న రెండు రోజుల‌కే.... స‌ద‌రు నిర్మాత‌లు మ‌రో క‌థానాయిక‌ని ప‌ట్టేశార‌ని తెలుస్తోంది. డ‌బ్బంటే ఎవ‌రికి చేదు చెప్పండి?? కాజ‌ల్ మాత్రం.. తాను న‌మ్ముకొన్న సిద్దాంతాల‌కు లోబ‌డే.. కోట్ల‌ను కూడా కాద‌నుకొంది. ఈ విష‌యంలో ఈ కాటుక క‌ళ్ల చిన్న‌దాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.