English | Telugu

ష‌క‌ల‌క శంక‌ర్‌ని ప‌వ‌న్ చిత‌గ్గొట్టాడా??

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని నేను అభిమానిని కాదు భ‌క్తుడ్ని.. అంటూ ప్ర‌క‌టించుకొన్న‌వారిలో ష‌క‌ల‌క శంక‌ర్ కూడా ఉన్నాడు. ప‌వ‌న్‌ని సొంత డ‌బ్బుల‌తో గుడి క‌డ‌తా.. అని అప్పుడెప్పుడో ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అలాంటి ష‌క‌ల‌క‌శంక‌ర్ కి ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో బ‌డిత పూజ జ‌రిగిందంటే.. న‌మ్మ‌గ‌ల‌రా?? అవును.. ఇది నిజం. ప‌వ‌న్ చేతిలో ష‌క‌ల‌క శంక‌ర్ దెబ్బలుతిన్నాడ‌న్న‌ది లేటెస్ట్ న్యూస్‌. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదు. నిజంగానే.స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ష‌క‌ల‌క శంక‌ర్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు. గ‌బ్బ‌ర్ గ్యాంగ్‌లో ఓ కానిస్టేబుల్ అన్న‌మాట‌. స‌ర్దార్ షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా సాగిపోతోంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఆఘ‌మేఘాల మీద స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ష‌క‌ల‌క శంక‌ర్‌ని మంగ‌ళ‌వారం ఉద‌యం తొమ్మిదింటికి ర‌మ్మంటే, ఆయ‌న నిదానంగా ప‌న్నెండు గంట‌ల‌కు వ‌చ్చాడ‌ట‌.

అదేంట‌ని అడిగితే త‌ల‌తిక్క‌గా స‌మాధానం చెప్పాడ‌ట‌. ఈ విష‌యం ప‌వ‌న్ వ‌ర‌కూ వెళ్లింద‌ని టాక్‌. ప‌వ‌న్ పిలిచి క్లాస్ తీసుకోబోతే... ప‌వ‌న్ ముందు కూడా తేడాగా మాట్లాడాడ‌ట ష‌క‌ల‌క శంక‌ర్‌. దాంతో వవ‌న్ సీరియ‌స్ అయ్యాడ‌ని, చేయి కూడా చేసుకొన్నాడ‌ని టాక్‌. ఇక మీద‌ట ఇదే సీన్ రిపీట్ అయితే.. మామూలుగా ఉండ‌ద‌ని వార్నింగ్ కూడా ఇచ్చాడ‌ట‌. దాంతో ష‌క‌ల‌క శంక‌ర్ కూడా తీవ్ర‌మ‌న‌స్తాపానికి గుర‌య్యాడ‌ట‌. మంగ‌ళ‌వారం రాత్రి ఈ విష‌యం తెలుసుకొన్న జ‌బ‌ర్‌ద‌స్త్ మిత్ర‌బృందం ష‌క‌ల‌క శంక‌ర్ ఇంటికెళ్లి ఓదార్చి వ‌చ్చార‌ట‌. `ప‌వ‌న్‌తో కాస్త జాగ్ర‌త్త‌` అంటూ.. హిత‌వు ప‌లికార‌ట‌. అదీ నిజ‌మే..! దేవుడికి ఇష్ట‌మైతే వ‌రాలిస్తాడు, కోపం వ‌స్తే శ‌పిస్తాడు. ప‌వ‌న్‌కి కోపం వ‌చ్చింది. శ‌పించాడు. ఇలా అనుకొంటే ఏ గొడ‌వా ఉండ‌దు క‌దా?