English | Telugu

ఆమెను ప‌వ‌న్ వ‌దిలేసిన‌ట్టేనా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి సినిమా క‌బుర్ల కంటే.. త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల గురించే అభిమానులు ఎక్కువ‌గా మాట్లాడుకొంటుంటారు. మ‌రీ ముఖ్యంగా.. పెళ్లిళ్ల విష‌యంలో ప‌వ‌న్ వేసిన త‌ప్ప‌ట‌డుగులు ఇప్ప‌టికీ... హాట్ టాపిక్‌లే! తాజాగా ప‌వ‌న్‌తో ఓ అమ్మాయి పేరు వేడి వేడి క‌బుర్ల‌లో లింక‌ప్ అయిపోతూ వ‌స్తోంది. త‌న పేరే... అనీషా ఆంబ్రోస్‌! ఒక‌ట్రెండు ఫ్లాప్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన అనీషా... ప‌వ‌న్ న‌టించిన గోపాల గోపాల‌లో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించింది. సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌లో క‌థానాయిక అనీషానే అని చెప్పుకొన్నారు. దాంతో.. ఎవ‌రీ అనీషా అంటూ.. అంద‌రి క‌ళ్లూ అటు వైపుకే తిరిగాయి.

ప‌వ‌న్ అనీషాతో చాలా స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని చెప్పుకొన్నారు. ఆ కార‌ణం వ‌ల్లే.. ప‌వ‌న్ సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మ‌డికి ప్ర‌మోష‌న్ ద‌క్కింద‌ని గుస‌గుస‌లాడుకొన్నారు. కొంత‌కాలం వీరిద్ద‌రి మ‌ధ్య వ్య‌వ‌హారం.. బాగానే న‌డించింద‌ట‌. ఆ త‌ర‌వాత ప‌వ‌న్ అనీషాని దూరం పెట్టేశాడ‌ని టాక్‌. అంతేకాదు.. స‌డ‌న్‌గా స‌ర్దార్‌లోకి అనీషా స్థానంలో కాజ‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డం కూడా జ‌రిగిపోయింది. ప‌వ‌న్ పేరు చెప్పుకొని అనీషా.. బ‌య‌ట మ‌రీ రెచ్చిపోయింద‌ట‌. సెట్లో కూడా అన్నీ తానై ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూసిందట‌.

ఈ వ్య‌వ‌హారం న‌చ్చ‌కే ప‌వ‌న్ ఆమెను దూరం పెట్టాడ‌ని, వీళ్లిద్ద‌రి మ‌ధ్య సంబంధం పూర్తిగా బెడ‌సి కొట్టింద‌ని చెప్పుకొంటున్నారు. అయితే.. స‌ర్దార్‌లో కొత్త‌మ్మాయికి బ‌దులుగా కాజ‌ల్ లాంటి స్టార్ హీరోయిన్ ఉంటేనే బాగుంటుంద‌ని నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ప‌వ‌న్‌కి న‌చ్చజెప్పాడ‌ని, కేవ‌లం సినిమాకి మైలేజీ తీసుకురావ‌డానికే ఆంబ్రోస్‌ని ప‌క్క‌న పెట్టార‌ని, ఆంబ్రోస్ - ప‌వ‌న్ ల సంబంధం ఇంకా కొన‌సాగుతూనే ఉంద‌న్న గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి. క‌థానాయిక‌గా క‌నిపించాల్సిన ఆంబ్రోస్‌.. ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో మెర‌వ‌బోతోంద‌ని అంటున్నారు. మ‌రి నిజ‌మో కాదో తెలియాలంటే స‌ర్దార్ వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి.