English | Telugu

`స‌లార్`లో `చంద్ర‌ముఖి`?

`చంద్ర‌ముఖి`తో తమిళ‌, తెలుగు భాష‌ల్లో న‌టిగా ఎన‌లేని గుర్తింపుని తెచ్చుకుంది వెర్సటైల్ యాక్ట్ర‌స్ జ్యోతిక‌. ఆ సినిమాకి ముందు, త‌రువాత జ్యోతిక ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. ఈ హార‌ర్ కామెడీ మూవీ తెచ్చిన ఇమేజ్ వేరు. క‌ట్ చేస్తే.. భారీ విరామం త‌రువాత `చంద్ర‌ముఖి` త‌ర‌హాలో అభినయానికి అవ‌కాశ‌మున్న మ‌రో శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ట జ్యోతిక‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, `కేజీఎఫ్` కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో `స‌లార్` పేరుతో ఓ యాక్ష‌న్ సాగా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్ర‌భాస్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నట్లు ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు.. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి అక్క పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ నటించ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య వినిపించింది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ పాత్ర‌లో జ్యోతిక‌ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. జ్యోతిక‌కి ఇదే ఫ‌స్ట్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ అయ్యే అవ‌కాశ‌ముంది. త్వ‌ర‌లోనే `స‌లార్`లో జ్యోతిక ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, శ్రుతి హాస‌న్ నాయిక‌గా న‌టిస్తున్న `స‌లార్`ని.. 2022 ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.