English | Telugu
పవన్ కోసం భారీ కళాశాల సెట్?
Updated : May 21, 2021
`గబ్బర్ సింగ్` (2012) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. జూలైలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో పవన్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఐబీ ఆఫీసర్ రోల్ కాగా.. మరొకటి లెక్చరర్ క్యారెక్టర్ అని టాక్. కాగా, లెక్చరర్ పాత్ర మెయిన్ లీడ్ కావడంతో.. కథానుసారం కళాశాల నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఎంతో ప్రాధాన్యముంటుందట. ఈ నేపథ్యంలోనే.. ప్రముఖ కళాదర్శకుడు, పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి నేతృత్వంలో ఓ భారీ కాలేజ్ సెట్ ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సెట్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని టాక్. మరి.. ఈ కథనంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, అన్నీ అనుకూలిస్తే 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.