English | Telugu
గ్యారేజ్ సక్సెస్‌మీట్‌కు అందుకే పర్మిషన్ ఇవ్వలేదా..?
Updated : Sep 8, 2016
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ టాక్‌తో సంబంధం లేకుండా విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 50 కోట్ల మార్కును చేరుకుని 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్మాతలు డిసైడయ్యారు. దీనిలో భాగంగా విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఈ నెల 10వ విజయోత్సవ వేడుకలు జరుగుతాయని ప్రకటించారు కూడా. అయితే ఈ సభకు విశాఖ పోలీసులు అనుమతి నిరాకరించారు..ఈ మాటతో అభిమానుల ఆనందానికి బ్రేకులు వేసినట్లైంది. సభకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి పోలీసులు చూపిన కారణం గణేశ్ నిమజ్జనం. సరిగ్గా అదే రోజు నగరంలో భారీగా నిమజ్జనాలు ఉండటంతో మీట్‌కు భద్రతా కల్పించలేమన్నది పోలీసుల వాదన. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే సక్సెస్ మీట్‌కు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నది ఎన్టీఆర్ అభిమానుల వాదన. ఎన్టీఆర్ అంటే పడని ఒక వర్గం చెప్పినట్లు ఖాకీలు నడుచుకుని అనుమతిని అటకెక్కించారని ఆరోపిస్తున్నారు. దీంతో వేడుకను చిత్ర నిర్మాతలు వాయిదా వేసినట్లేనా..లేక మరోసారి నిర్వహిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.