English | Telugu

సీక్వెల్ బాట‌లో `జాతిర‌త్నాలు`?

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి స్థాయిని పెంచిన చిత్రం `జాతిర‌త్నాలు`. `ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌` వంటి స‌క్సెస్ ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ త‌రువాత న‌వీన్ న‌టించిన హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌తో క‌లిసి న‌వీన్ సంద‌డి చేసిన‌ ఈ లో-బ‌డ్జెట్ మూవీ.. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న థియేట‌ర్స్ లో విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కేవ‌లం రూ.4 కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్ తో రూపొందిన ఈ కామిక్ ఎంట‌ర్ టైన‌ర్.. దాదాపు రూ.40 కోట్ల వ‌ర‌కు షేర్ ఆర్జించి ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రిచింది.

అలాంటి `జాతిర‌త్నాలు`కి సీక్వెల్ తీసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట ద‌ర్శ‌కుడు అనుదీప్. పొట్ట‌కూటి కోసం ముగ్గురు స్నేహితులు హైద‌రాబాద్ వ‌స్తే ఏం జ‌రిగింద‌నే పాయింట్ తో `జాతిర‌త్నాలు` తెర‌కెక్కితే.. అదే ముగ్గురు ఫ్రెండ్స్ అమెరికాకి వెళ్తే ఏం జ‌రుగుతుంది అనే స్టోరీ లైన్ తో సీక్వెల్ ఉండ‌బోతోంద‌ట‌. అయితే, ఈ సీక్వెల్ కంటే ముందు న‌వీన్ - అనుదీప్ వేరే స‌బ్జెక్ట్ తో మ‌రో సినిమా చేయ‌నున్నార‌ట‌. అద‌య్యాక స్మాల్ బ్రేక్ తీసుకుని `జాతిర‌త్నాలు` కొన‌సాగింపు చిత్రంపై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు వినికిడి. మ‌రి.. `ఫ‌న్`టాస్టిక్ ఫ్రెండ్స్ `జాతిరత్నాలు`.. సీక్వెల్ తోనూ ఇంప్రెస్ చేస్తారేమో చూడాలి.