English | Telugu

చైతూతో `ఇస్మార్ట్` పోరి?

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా `థాంక్ యూ` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `జోష్` (2009) త‌రువాత `దిల్` రాజు నిర్మాణంలోనూ.. `మ‌నం` (2014) అనంత‌రం ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ కాంబినేష‌న్ లోనూ చైతూ చేస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. `ప్రేమ‌మ్` త‌ర‌హాలో `థాంక్ యూ`లోనూ చైతూ మూడు వేర్వేరు ద‌శ‌ల్లో సాగే పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని టాక్. దానికి త‌గ్గ‌ట్టే.. ముగ్గురు క‌థానాయిక‌లు అత‌నికి జోడీగా ద‌ర్శ‌న‌మిస్తార‌ని చాలా కాలంగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే, క‌థానాయిక‌లు ఎవ‌ర‌న్న విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇప్ప‌టికే ఓ హీరోయిన్ గా మాళ‌వికా నాయ‌ర్ క‌న్ఫామ్ అయింద‌ని.. అతిథి పాత్ర‌లో చైతూ శ్రీ‌మ‌తి, అగ్ర క‌థానాయిక స‌మంత సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. కాగా, తాజాగా మ‌రో నాయిక‌గా `ఇస్మార్ట్` పోరి న‌భా న‌టేశ్ ఎంపికైంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. త్వ‌ర‌లోనే `థాంక్ యూ`లో న‌భా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ఈ ఏడాది ద్వితీయార్థంలో `థాంక్ యూ` థియేట‌ర్స్ లోకి రానుంది. దానికంటే ముందు `ల‌వ్ స్టోరి`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు చైతూ. ఏప్రిల్ 16న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ రిలీజ్ కానుంది.