English | Telugu

ఆ యువ హీరో పెళ్లి ఆగిపోయిందా??

ప్ర‌భాస్ లాంటి బ్ర‌హ్మ‌చారులు పెళ్లీ పెటాకులు లేకుండా ముదిరిపోతుంటే.. అతను ఒక స్టార్ హీరో కొడుకు..ఒకే ఒక్క సినిమా చేసిన ఓ యువ హీరో... మొన్నామ‌ధ్యే నిశ్చితార్థం చేసేసుకొన్నాడు. ఇంత లేత‌గా ఉన్న కుర్రాడికి అప్పుడే పెళ్లిపై మ‌న‌సు ఎందుకు వెళ్లింద‌బ్బా..?? అని ఆశ్చ‌ర్య‌పోయారంతా. ఆ పిల్ల‌డిది ప్రేమ వ్య‌వ‌హార‌మ‌ని, అమ్మాయి వాళ్లు బాగా ఆస్తి ప‌రులని తెలిసొచ్చింది. పోనీలే.. కుర్రాడు బాగానే ప్లానింగు వేసుకొన్నాడు అని స‌ర్దుకొన్నారు. ఇంత‌లోనే మ‌రో ట్విస్టు వ‌చ్చింది.

ఈ పెళ్లి.. స‌జావుగా జ‌రిగేలా లేద‌ని, ఎప్పుడైనా ఆగిపోవొచ్చ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అటు పెళ్లి కొడుకు ఫ్యామిలీకి, ఇటు పెళ్లి కూతురు ఫ్యామిలీకి అస్స‌లు ప‌డ‌డం లేద‌ట‌. ఏదో విష‌యానికి చిర్రుబుర్రులు ఆడుకొంటూనే ఉన్నార్ట‌. అందుకే.. పెళ్లి జ‌రిగేది అనుమాన‌మే అని తేల్చేస్తున్నారు. అయితే... హీరోగారు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొందామ‌ని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తుంది. కుర్రాడ‌నుకొంటే ఏమైనా చేస్తాడు క‌దా? అందుకే ఈ విష‌యంలో పెద్ద‌ల్ని ఎదిరించైనా స‌రే పెళ్లి చేసుకొందామ‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. హీరో పెళ్లి... ఆఖ‌రికి సినిమా టిక్ గానే జ‌ర‌గ‌బోతోంద‌న్న‌మాట‌. మ‌రి ఈ పెళ్లి క‌థ‌లో ఇంకెన్ని మ‌లుపులు చూడాల్సివ‌స్తుందో వెయిట్ అండ్ సీ. ఇంత‌కీ ఆ పెళ్లి కొడుకు ఎవ‌రో గెస్ చేశారా??