English | Telugu
గోపాల గోపాల 9నేనా?
Updated : Jan 5, 2015
పవన్ అభిమానులకు ఇది శుభవార్తే. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న గోపాల గోపాల... ఇంకాస్త ముందుగానే ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ఈనెల 9నే తీసుకొస్తే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఎందుకంటే 9న వస్తుందనుకొన్న ఐ ఈనెల 14నకి వాయిదా పడింది. అంటే 9 ఖాళీ. అందుకే గోపాల గోపాలని 9నే విడుదల చేయాలని డి. సురేష్‌బాబు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. మంగళ, బుధవారాల్లోగా సెన్సార్ పూర్తి చేసి.. రిలీజ్‌కి క్లియరెన్స్ తెచ్చుకోవాలని చిత్రబృందం యోచిస్తోంది. మరోవైపు ఆర్.ఆర్ కూడా పూర్తయిపోయింది. 9న విడుదల చేస్తే... ఏకంగా వారం రోజుల పాటు గోపాల కలెక్షన్లకు తిరుగు ఉండదు. పండగ తరవాత కూడా థియేటర్లు ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐ వచ్చేలోపుగానే వసూళ్లు కుమ్ముకోవచ్చు. ఒకవేళ పండక్కి ఐ రాకపోతే గోపాలకు మరింత ప్లస్. అందుకే సురేష్ బాబు 9వ తారీఖుని వదిలేట్టు కనిపించడం లేదు.