English | Telugu

రాజ‌మౌళి.. త‌మ‌రు కాస్త త‌గ్గాలి!

బాహుబ‌లి సాధించిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు ఏదో ఓ సంద‌ర్భంలో బాహుబ‌లిని గుర్తు చేసుకొంటూనేఉన్నారు. బాహుబలి సృష్టించిన అద్భుతాల దృష్ట్యా... బాహుబ‌లి 2పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈసారి రాజ‌మౌళి - ప్ర‌భాస్‌లు క‌లిసి ఇంకెన్ని వండ‌ర్స్ చూపిస్తారో అని ఆశ‌ప‌డుతున్నారు సినీ అభిమానులు. ఆ అంచ‌నాల్ని, హైప్‌ని ఎవ్వ‌రూకంట్రోల్ చేయ‌లేరు.కానీ.. రాజ‌మౌళి బృందం మాత్రం ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని పెంచే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు తోస్తోంది. బాహుబ‌లి 2కి సంబంధించిన ప్ర‌తీ విష‌యం మీడియా దృష్టిలో ప‌డేట్టు ఫోక‌స్ చేస్తోంది జ‌క్క‌న్న టీమ్‌. క్లైమాక్స్ ఏ రేంజులో ఉంటోంద‌న్న‌ది ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. 90 రోజులు పాటు క్లైమాక్స్ చిత్రీక‌రిస్తార‌ని జ‌క్క‌న్న ట్వీట్ చేశాడు. 90రోజుల క్లైమాక్స్ అంటే మాట‌లా? ఆ టైమ్‌లో ఓ సినిమానే తీసేయొచ్చు.

క్లైమాక్స్ తొలిరోజు ముందు హంగామాని కూడా ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. దానికి తోడు బాహుబ‌లి 2లో కొత్త స్టార్స్ ని తీసుకొనే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు భోగ‌ట్టా. ఎన్టీఆర్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాడ‌న్న ప్ర‌చారంజోరుగా సాగుతోంది. దానికి తోడు ప్రియ‌మ‌ణి కూడా బాహుబ‌లి 2 సెట్లో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఇవ‌న్నీ చూస్తుంటే పార్ట్ 2పైకావాల‌నే హైప్ క్రియేట్ చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే పెరిగిపోయిన అంచ‌నాలు చాలు... అవి రెట్టింపు అయితే.. త‌ట్టుకోవ‌డం ఎవ‌రికైనా క‌ష్ట‌మే. అంచ‌నాల భారం మోయ‌లేక బాక్సాఫీసు ద‌గ్గ‌ర చ‌తికిల ప‌డిన సినిమాలెన్నో ఉన్నాయి. ఆ సినిమాల జాబితాలో బాహుబ‌లి 2 చేర‌కూడ‌ద‌న్న‌దే తెలుగు ప్రేక్ష‌కుల ఆకాంక్ష‌. దాన్ని రాజ‌మౌళి గుర్తిస్తే మంచిది.