English | Telugu

బాహుబ‌లి గురించి మాట్లాడొద్దు: శ్రీ‌దేవి

బాహుబ‌లి పేరెత్త‌గానే.. అంద‌రూ ఆహా, ఓహో అనేవాళ్లే. ఇండియ‌న్ సినిమాని మ‌రో మెట్టుపైకి తీసుకెళ్లార‌ని, హాలీవుడ్ సినిమాలాంటిద‌ని కితాబుఇచ్చిన‌వాళ్లెంతోమంది. బాహుబ‌లి గురించి.. ఉద్వేగంగా మాట్లాడేవాళ్ల సంఖ్య‌కు లెక్కేలేదు. వీళ్ల‌లో సెల‌బ్రెటీలే ఎక్కువ‌. అయితే ఈ సినిమా గురించి మాట్లాడ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌ని సినీతార ఒక‌రున్నారు. ఆమెవ‌రో తెలుసా...??? శ్రీ‌దేవి. అవును... అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి - బాహుబ‌లి పేరు చెప్ప‌గానే చిర్రెత్తుకుపోతోందట‌.

ర‌మ్య‌కృష్ణ పోషించిన శివ‌గామి పాత్ర కోసం ముందు శ్రీ‌దేవి పేరునే ప‌రిగ‌ణ‌లోకి తీసుకొన్నారు. అయితే ఈ పాత్ర కోసం ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేయ‌డంతో ఆ అవ‌కాశం ర‌మ్య‌కృష్ణ‌కు వెళ్లింది. ఆ పాత్ర‌లో ర‌మ్య అద్భుతంగా ఇమిడిపోయిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లిలో అవ‌కాశాన్ని ఎందుకు వ‌దులుకోవాల్సివ‌చ్చింది? అని అడిగితే.. శ్రీ‌దేవి అస‌హ‌నం ప్ర‌ద‌ర్శిస్తోంది. ''బాహుబ‌లి గ‌తం.. ఆ సినిమా వ‌చ్చిందీ, వెళ్లిపోయింది. దాని గురించి అన‌వ‌స‌రంగా మాట్లాడుకోవ‌డం ఎందుకు?'' అంటోంది. ఈ సినిమా గురించి మాట్లాడ‌డం శ్రీ‌దేవికి ఏమాత్రం ఇష్టం లేద‌ట‌. ఆ పాత్ర ఎందుకు వ‌దులుకోవాల్సి వ‌చ్చిందో కూడా శ్రీ‌దేవి చెప్ప‌డం లేదు.

త‌న నోటి నుంచి తాను బ‌య‌ట‌ప‌డ‌క‌పోయినా, అదంతా.. పారితోషికం విష‌యంలో వ‌చ్చిన తేడా అని అర్థ‌మ‌వుతూనే ఉంది. పారితోషికం కోసం ఓ మంచి సినిమాలో న‌టించే అవ‌కాశం కోల్పాయాన‌ని శ్రీ‌దేవివి ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతోంది. ఆ బాధే అస‌హ‌నం రూపంలో ఇలా బ‌య‌ట‌ప‌డిపోతోందన్న‌మాట‌.