English | Telugu

ఎన్టీఆర్ ప‌క్క‌న ప‌డేస్తే.. చిరుకి త‌గిలించాడా??

చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150 పాట‌ల ప‌ట్ల మెగా అభిమానులు ఏమాత్రం సంతృప్తిగా లేరు. `బాస్ ఈజ్ బ్యాక్` అంటూ చొక్కాలు చించుకొంటున్న చిరు ఫ్యాన్స్‌కి దేవిశ్రీ ప్ర‌సాద్ ట్యూన్లు ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అమ్మ‌డు లెట్స్ గో కుమ్ముడు పాట‌పై ఇప్ప‌టికే చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ పాట కాపీ ట్యూన్ అని, లిరిక్స్ కూడా ఏమంత గొప్ప‌గా లేవ‌ని డైరెక్ట్‌గానే దేవిశ్రీ‌ని దుయ్య‌బ‌డుతున్నారు ఫ్యాన్స్‌. ఖైదీ నెంబ‌ర్ 150 కోసం విడుద‌ల చేసిన రెండో పాట కూడా చిరు ఫ్యాన్స్‌కి రుచించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు పాట‌పై విమ‌ర్శ‌ల వాడి మ‌రింత పెంచారు. ఇప్పుడు ఈ పాట‌కు సంబంధించిన ఓ గాసిప్ టాలీవుడ్‌లో షికారు కొడుతోంది. అమ్మ‌డు లెట్స్ గో కుమ్ముడు పాట‌ని చిరు కోసం ట్యూన్ చేయ‌లేద‌ట‌. ఇది ఎన్టీఆర్ పాట అని తెలుస్తోంది. జ‌న‌గా గ్యారేజ్ కోసం దేవి ఈ పాటని ట్యూన్ చేశాడ‌ట‌. అయితే.. ఎన్టీఆర్ దాన్ని ప‌క్క‌న పెట్టాడ‌ని, ఇప్పుడు అదే పాట తీసుకొచ్చి చిరంజీవి ఆల్బ‌మ్‌లో పెట్టేశాడ‌ని చెబుతున్నారు. అదే నిజ‌మైతే... రిజ‌క్ట్ చేసిన ట్యూన్ల‌ను బ‌ల‌వంతంగా చిరు సినిమాకి క‌నెక్ట్ చేసేశాడ‌న్న‌మాట‌. దేవిపై న‌మ్మ‌కంతో చిరు కూడా ట్యూన్ల విషయంలో ఏమాత్రం క‌ల‌గ చేసుకోలేద‌ని. 'నీకు ఏది న‌చ్చితే అది చేయ్‌' అంటూ చిరు ఫ్రీడ‌మ్ ఇచ్చాడ‌ని, దాన్ని దేవి ఇలా మిస్ యూస్ చేసుకొన్నాడ‌ని.. ఫ్యాన్స్ వాపోతున్నారు. ఎన్టీఆర్ పాట చిరుకి అంట‌గ‌ట్ట‌డం కూడా వాళ్ల‌ని బాధించేదే. మున్ముందు దేవిశ్రీ ప్ర‌సాద్ ఇంకెన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సివ‌స్తుందో..??