English | Telugu

కొరియర్ బాయ్ పాటలతో అదరగోడుతున్నాడు

అసలు రిలీజ్ కాదేమో అనుకున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా మళ్ళీ బయటకు వచ్చింది. ఆడియో వేడుక కూడా జరుపుకొంది. మెగా ఫంక్షన్ వుండడంతో ఈ పంక్షన్ పై ఏవరు సరిగా దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పిచ్చ రెస్పాన్స్ వస్తోంది. పాటలన్నీ సూపర్‌గా ఉన్నాయనే టాక్మొదలైంది.మొదట మందుపాటతో మొదలెట్టి... మాంచి స్టెప్పులేశాడు. సిగ్గు బాగుందే అంటూ యామీ గౌతమ్ తో ఆడిపాడాడు నితిన్. ఆ తర్వాత బంగారమా సింగారమా.. అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ విజువలైజేషన్ అయితే సూపర్‌గా ఉంది. మొత్తం నాలుగుపాటలున్న ఈ ఆల్బమ్... మాయా ఏంచేశావే మాయా అంటూ పాడే పాటతో పూర్తవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. దీంతో ఈ సినిమా తో నితిన్ హిట్ కొట్టే అవకశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.