English | Telugu

ర‌వితేజ‌కు ఝ‌ల‌క్ ఇచ్చాడు

కొత్త కుర్రాడు రాజ్ త‌రుణ్ టైమ్ న‌డుస్తుందిప్పుడు. వ‌రుస‌గా రెండు హిట్ల‌తో స‌రికొత్త క్రేజ్ తెచ్చుకొన్నాడు. ఇప్పుడు చిన్న నిర్మాత‌ల దృష్టి... రాజ్ త‌రుణ్‌పై ప‌డింది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వంశీ కూడా రాజ్ త‌రుణ్ తో ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ర‌వితేజ కోసం వంశీ అప్పుడెప్పుడో ఫ్యాష‌న్ డిజైన‌ర్ అనే స్ర్కిప్టు రెడీ చేసుకొన్నాడు. రాజేంద్ర ప్ర‌సాద్ తో తెర‌కెక్కించిన లేడీస్ టైల‌ర్‌కి సీక్వెల్ ఇది. ర‌వితేజ కోసం ప‌డిగాపులు కాచిన వంశీకి నిరాశే ఎదురైంది. ఇదిగో అదిగో అంటూ ర‌వితేజ డేట్లు ఇవ్వ‌డం మానేశాడు. దాంతో.. వంశీ కూడా ఈ క‌థ‌ని ప‌క్క‌న పెట్టేశాడు. ర‌వితేజ లాంటి ఈజ్‌తో ఆక‌ట్టుకొంటున్న రాజ్ త‌రుణ్‌..ని చూసి వంశీకి మ‌ళ్లీ ఫ్యాష‌న్ డిజైన‌ర్ సినిమా గుర్తొచ్చింది. అందుకే ఇప్పుడు పాత కథ‌ని రీమోడ‌లింగ్ చేసి సినిమాగా మ‌ల‌చ‌డానికి ట్రై చేస్తున్నాడు వంశీ. ఇది వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయాల్సిన క‌థ‌ల‌న్నీ ర‌వితేజ చేసేసేవాడు. ప‌వ‌న్ క‌ల్షీట్లు దొరక్క ర‌వితేజ‌తో చాలామంది ఎడ్జిస్ట్ అయ్యేవారు. అలా ర‌వితేజ స్టార్ గా మారాడు. ఇప్పుడు ర‌వితేజ‌కు ఝ‌ల‌క్ ఇచ్చి, అత‌ని క‌థ‌ల్ని తాను ఒడిసిప‌ట్టుకొంటున్నాడు రాజ్ త‌రుణ్‌. మొత్తానికి ర‌వితేజ స్థానానికి ఈ కుర్రాడు ఎస‌రెట్టేసేలా ఉన్నాడు.