English | Telugu
ఆమెది ఆత్మహత్య కాదు.. హత్యే..?
Updated : Dec 28, 2016
కమెడియన్ రమేష్ భార్య త్రిపురాంభిక ఇటీవలే తన స్వగృహములో ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు తెలిసిందే.. ఈ కేసు విచారణలో భాగంగా త్రిపురాంభిక తల్లి పుష్ప ఎన్నో పచ్చినిజాల్ని బయటపెట్టారు. మాది మధ్యతరగతి ఫ్యామిలీ. మాకు రమేష్ కుటుంబంతో దూరపు చుట్టరికం వుంది. ఆ చుట్టరికంతోనే రమేష్‌కి మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేశాము. పెళ్ళికి ముందు మా పేదరికం గురించి వారికి వివరించాము. వారు కట్నం ఏమీ వద్దు అంటూ పెళ్ళిచేసుకున్నారు. పెళ్ళిచేసుకున్న తర్వాత మూడు నెలల వరకు మా అమ్మాయిని బాగానే చూసుకున్నారు. ఆ తర్వత నుంచి కట్నం కోసం ఆమెను టార్చర్ చేయడం మొదలు పెట్టారు. సూటిపోటి మాటలతో జీవితంపై విరక్తి కలిగించేలా ప్రవర్తించేవారు. నా బిడ్డ చనిపోలేదు.. వాళ్లే చంపేశారు. కట్నం కోసం హింసించిమరీ చంపేశారు. నా బిడ్డను అన్యాయంగా పొట్టన పొట్టుకున్న వాళ్లను కఠినంగా శిక్షించాలి’ అని త్రిపురాంభిక తల్లి పుష్ప ఆవేదన వ్యక్తం చేశారు.