English | Telugu
చిరు సినిమా రీషూట్..??
Updated : Aug 5, 2016
రీషూట్లన్నవి ఈమధ్య కామన్ అయిపోయింది. ఇది వరకు సినిమాని రీషూట్ చేస్తున్నారంటే..ఎన్నెన్ని అనుమానాలో..? ఇప్పుడు మాత్రం `బెటర్ మెంట్ కోసం రీషూట్ చేయడంలో తప్పేంటి` అని సరదు దర్శక నిర్మాతలే మొహం మీద చెప్పేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి 150వ సినిమా కూడా రీషూట్ల ట్రెండ్ ఫాలో అయిపోతోందని టాక్. ఈ మధ్యే చిరంజీవి సినిమా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. తొలుత చిరు - అలీలపై కామెడీ సీన్లు తెరకెక్కించారు. రషెష్ చూసిన చిరు.. ఆయా సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తపరిచాడట. కామెడీ ఏమాత్రం పండలేదని.. తెగ ఫీలైపోయాడట. నిజానికి అలీ క్యారెక్టర్ సునీల్ చేయాల్సింది. సునీల్‌ని అడిగితే కాల్షీట్లు లేవని తప్పుకొన్నాడు. ఇప్పుడు సునీల్ అందుబాటులోకి వచ్చాడు. దాంతో చిరువ్యూహం మార్చాడు. అలీతో తీసిన ఆయా సన్నివేశాలన్నీ సునీల్ తో రీషూట్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు టాక్. వాటిని మళ్లీ సునీల్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు తిరగ రాస్తున్నారట. ఇప్పుడు సునీల్ తో చేయిద్దామనుకొన్న క్యారెక్టర్ అలీతో చేయిస్తున్నార్ట. మొత్తానికి చిరు సినిమా ఇలా మొదలైందో లేదో... అలా రీషూట్ కూడా జరుపుకోవడానికి రెడీ అయ్యింది. ట్రెండ్ అలా ఉంది మరి. చిరు సినిమా అయినా... దాన్ని ఫాలో అవ్వాల్సిందే.