English | Telugu

దర్శకుడికి దడ పుట్టించిన దీపికా!

బాలీవుడ్ లో పేరుతోపాటు టాలెంట్ కూడా ఉన్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. "రామ్ లీలా, భాజీరావ్ మస్తానీ" చిత్రాలతో దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకొన్నాడు. తాజాగా "పద్మావతి" అనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు జిల్లా మహారాణి చరిత్ర ఆధారంగా "పద్మావతి" అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు. టైటిల్ పాత్ర కోసం తన మునుపటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాక చిత్రాల విజయాల్లో కీలకపాత్ర పోషించిన దీపికాను ఎంచుకొన్నాడు. కానీ.. "బాజీరావ్ మస్తానీ" అనంతరం బాలీవుడ్ లో బిచాణా ఎత్తేసి హాలీవుడ్ లో జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమా చేస్తుంది కాబట్టి తన రేంజ్ పెరిగింది అనుకొందో లేక మరో కారణమో తెలియదు కానీ.. ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ ను రెండింతలు చేసేసింది. ఇదివరకూ 6 కోట్ల రూపాయల పారితోషికాన్ని పుచ్చుకొనే దీపికా తాజా చిత్రం "పద్మావతి" కోసం ఏకంగా 13 కోట్ల వరకూ అడిగిందని సమాచారం. దీపికా చెప్పిన ఎమౌంట్ కి భన్సాలీకి మతి భ్రమించిందట. తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన భన్సాలీకి కనీసం కర్టెసీ కోసం కూడా కోటి తగ్గించుకోలేనని దీపికా చెప్పడం విశేషం!